తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రైస్తవులకు అండగా సర్కారు: వినయ్ భాస్కర్ - Mla vinay bhaskar distributes xmas gifts

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. క్రైస్తవులతో కలిసి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సంబురాలు జరుపుకున్నారు.

Mla vinay bhaskar distributes xmas gifts
హన్మకొండలో క్రిస్మస్ వేడుకలు

By

Published : Dec 18, 2019, 8:12 PM IST

క్రైస్తవులకు సర్కారు అండగా ఉంటుందని ప్రభుత్వ చీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా హన్మకొండలోని తన క్యాంప్ ఆఫీసులో క్రైస్తవులతో కలిసి సంబురాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

తెరాస ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా అర్హులైన వారందరికి... క్రిస్టియన్ సంఘాల సహకారం తీసుకొని గిఫ్ట్ ప్యాకెట్స్ అందజేసి విందు ఏర్పాట్లు చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

హన్మకొండలో క్రిస్మస్ వేడుకలు

ఇవీచూడండి: 'బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వండి'

ABOUT THE AUTHOR

...view details