వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండ బస్టాండ్ వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ పరిశీలించారు. జరుగుతున్న పనులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఎందుకు ఆలస్యంగా నడుస్తున్నాయని.. అక్కడ ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం - warangal urban district
హన్మకొండ బస్టాండ్ వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పరిశీలించారు. పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
కొంతమంది అధికారులకు సమాచారం ఇచ్చినా రాకపోవడం వల్ల వారికి ఎమ్మెల్యే ఫోన్ చేశారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రేపు కలెక్టరేట్లో జరిగే సమావేశానికి అధికారులు రావాలని సూచించారు.
ఇవీ చూడండి:నిరుపేదలకు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆపన్నహస్తం