తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాసపై అసత్య ఆరోపణలను సహించేది లేదు'

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్... తెరాస నాయకులపై బురద చల్లాలని చూస్తే ఎంతమాత్రం సహించేది లేదని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హెచ్చరించారు. ఎంపీ హన్మకొండలో చేసిన విమర్శలను ప్రభుత్వ చీఫ్ విప్ ఖండించారు.

mla vinay bhaskar and nannapaneni narender fire on nizamabad mp arvid at warangal urban district
తెరాసపై బురద చల్లాలని చూస్తే సహించేది లేదు: ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

By

Published : Jul 12, 2020, 7:56 PM IST

భాజపా, తెరాస నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నియోజకవర్గ ప్రజలు, పసుపు రైతులను నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్ మోసం చేశారని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆరోపించారు. ఎంపీ అర్వింద్... తెరాస నాయకులపై బురద చల్లాలని చూస్తే సహించేది లేదన్నారు. ఎంపీ హన్మకొండలో చేసిన విమర్శలను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జరిగిన సమావేశంలో ఖండించారు.

వలస కూలీలకు కేంద్రం మొండిచేయి చూపితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారిని అన్ని విధాలా ఆదుకున్నారని చెప్పారు. ఓరుగల్లు వాసులపై అభిమానం ఉంటే....రైల్‌ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌గా మార్పించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని అర్వింద్​కు సూచించారు.

ఏంపీ అర్వింద్ పరిపక్వత లేని ఓ నేత అని తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. పసుపు బోర్డు తెస్తానంటూ మాయ మాటలు చెప్పి... రైతులను దగా చేశారని విమర్శించారు. తప్పుడు విద్యార్హతలతో రాజ్యాంగాన్ని మోసం చేశారని ఆరోపించారు. భూకబ్జా చేశానని నిరూపిస్తే.. తాను రాజీనామా చేస్తానని.. లేదంటే అర్వింద్ రాజీనామా చేస్తారా.. అని సవాల్ విసిరారు.

ఇదీ చూడండి:జర జాగ్రత్త: ఆ జిల్లాల్లో రాగల మూడురోజులు భారీ వర్షాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details