తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేట్ అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీతక్క - mla seethakka visit deeksha centre warangal urban latest news

కరోనా కారణంగా ఉపాధి లేక ప్రైవేట్​ ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడిన అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వరంగల్ అర్బన్​ జిల్లా హన్మకొండలో చేపట్టిన భరోసా దీక్ష కేంద్రాన్ని ఆమె సందర్శించారు.

mla seethakka says The government should support private teachers
ప్రైవేట్ అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీతక్క

By

Published : Oct 19, 2020, 9:24 AM IST

కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రైవేట్​ ఉపాధ్యాయులకు మనో ధైర్యాన్ని కల్పించడానికి తెలంగాణ ప్రైవేట్​ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్​గౌడ్ ఆధ్వర్యంలో భరోసా దీక్ష చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ఈ భరోసా దీక్ష కేంద్రాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క, భాజపా రాష్ట్ర నాయకులు రాకేష్​రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​గౌడ్​ను పరామర్శించారు.

కరోనా నేపథ్యంలో జీతాలు లేక ప్రైవేట్​ ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధిక ఇబ్బందులతో అధ్యాపకులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని.. ఆత్మహత్యలకు పాల్పడిన ఉపాధ్యాయుల కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి.. మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జోగురామన్న

ABOUT THE AUTHOR

...view details