సెప్టెంబర్ 15న ఏపీలోని గోదావరి నదిలో పడవ బోల్తా ఘటనలో మృతిచెందిన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ వాసుల కుటుంబాలకు నష్టపరిహారం అందించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బాధిత కుటుంబీకులకు చెక్కులు అందించారు. గ్రామానికి చెందిన 15 మంది విహరయాత్రకు వెళ్లగా 9మంది మృత్యవాతపడ్డారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.10లక్షలు, తెలంగాణ సర్కారు రూ.5లక్షలు పరిహారం ప్రకటించగా..... వాటితో పాటు లేబర్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి అదనంగా రూ.6లక్షల 30వేల రూపాయలు అందించారు. మొత్తంగా తొమ్మిది మంది బాధిత కుటుంబాలకు కోటి, 66లక్షల, 50వేల విలువైన చెక్కులు అందించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ - checks distribution to the famalies of godavari boat accident
ఏపీలోని కచ్చలూరు వద్ద గోదావరిలో బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నష్టపరిహార చెక్కులను అందజేశారు.
బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ