పచ్చని ప్రకృతి వనాలతో పల్లెలు, పట్టణాలు వికసించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆకాంక్షించారు. హరితహారంతో రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారుతోందని అభిప్రాయపడ్డారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
పచ్చని ప్రకృతి వనాలతో పల్లెలు, పట్టణాలు వికసించాలి: ఎమ్మెల్యే - ఎమ్మెల్యే రమేశ్ తాజా వార్తలు
అతి త్వరలోనే సంపూర్ణ ఆకుపచ్చ తెలంగాణను చూడబోతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. హరితహారంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు.
పచ్చని ప్రకృతి వనాలతో పల్లెలు, పట్టణాలు వికసించాలి: ఎమ్మెల్యే
అనంతరం జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజా ప్రతునిధులతో కలసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అతి త్వరలోనే సంపూర్ణ ఆకుపచ్చ తెలంగాణను చూడబోతున్నామని రమేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం