వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని రాయిగూడెం గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధ్యక్షతన.. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని.. రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. రూ.22 లక్షల అంచనా వ్యయంతో ప్రతి 5వేల ఎకరాలకు ఒక రైతు వేదిక చొప్పున రాయిగూడెం క్లస్టరో శంకుస్థాపన చేశామని తెలిపారు.
రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజయ్య - ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని రాయిగూడెం గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శంకుస్థాపన చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.
రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజయ్య
దసరా పండుగ వరకు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. 150 నుండి 200 మంది రైతులు కూర్చొనేలా 1,498 చదరపు అడుగుల్లో హాలు, అధికారుల కోసం రెండు ప్రత్యేక గదులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. రైతు వేదికను అన్ని హంగులతో రైతులకు ఉపయోగకరంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ వేదికల ద్వారా వ్యవసాయ అధికారులు రైతులకు కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులను నేర్పించడానికి వీలు ఉంటుందన్నారు.
ఇదీ చూడండి:వేములవాడలో పొన్నం ప్రభాకర్ గృహ నిర్బంధం