వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే నరేందర్. 24వ డివిజన్లో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పాల్గొన్నారు.
నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పాల్గొన్నారు.
![నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ mla narender distributed dadily commodities](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7395716-913-7395716-1590752362516.jpg)
నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
స్థానిక కార్పొరేటర్‌తో పాటు తూర్పు నియోజకవర్గంలోని కార్పొరేటర్లు కూడా హాజరయ్యారు అనంతరం 200 మంది నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే చేతులమీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ కార్పొరేటర్ శారద జోషి కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే నచ్చజెప్పడం వల్ల తన పదవికి రాజీనామా చేస్తానన్న మాటలను వెనక్కి తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ ఉద్ధృతి