వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దేవాదుల ఎత్తిపోతల పథకంపై సమీక్షలో అధికారులపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ వద్దని వారించినా అధికారులపై ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినా అధికారులు పనుల్లో జాప్యం చేస్తున్నారని నిలదీశారు.
దేవాదుల ప్రాజెక్ట్ అధికారులపై ఎమ్మెల్యే ఫైర్ ... వద్దని వారించిన మంత్రులు - వరంగల్ అర్బన్ లేటెస్ట్ న్యూస్
దేవాదుల ఎత్తిపోతల పథకంపై వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సమీక్ష నిర్వహించారు. అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు వద్దని వారించినా అధికారులపై ఆయన మండిపడ్డారు.
దేవాదుల పథకంపై ఎమ్మెల్యే ఫైర్ ... వద్దని వారించిన మంత్రులు
దేవాదుల ప్రాజెక్టు ఎస్ఈ బంగారయ్య కనీసం పరిశీలించకుండా సమస్యను జఠిలం చేస్తున్నారని ఆరోపించారు. ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని మంత్రులు సముదాయించే ప్రయత్నం చేసినా... అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'దేవాదుల ప్రాజెక్ట్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి'
Last Updated : Nov 6, 2020, 3:09 PM IST