వరంగల్ 28వ డివిజన్లోని ఇస్లామియా కళాశాలలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేదలకు సరకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ యెలగం లీలావతి, సత్యనారాయణ పాల్గొన్నారు.
పేదలకు సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష.. జాగ్రత్తలు పాటిద్దాం కరోనాను నివారిద్దామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ సూచించారు. వరంగల్ 28వ డివిజన్లోని ఇస్లామియా కళాశాలలో ఆయన పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
Breaking News
కరోనా మహమ్మారి వల్ల పేదలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశ్యంతో నా వంతుగా సహాయం చేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. పేదలకు సేవ చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు.
ఇదీ చూడండి :అతడి కోసం మావో అగ్రనేతల కసరత్తు.. ఇంతకీ ఎవరి కోసం..?