తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడుతాం: వినయ్​భాస్కర్​ - వరంగల్​లో నాయి బ్రాహ్మణులతో సమావేశం

కాజీపేట్​ రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ఉద్యమం లాగా పోరాటం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు. కేంద్రం నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్​లో నాయి బ్రాహ్మణులతో ఆయన సమావేశమయ్యారు.

mla, chief vip vinay bhaskar comments kazipet railway coach factory in warangal
తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడుతాం: వినయ్​భాస్కర్​

By

Published : Mar 6, 2021, 3:39 PM IST

కేంద్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా కేంద్రం నిరుద్యోగులను మోసం చేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం లాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్​లోని క్యాంపు కార్యాలయంలో నాయి బ్రాహ్మణులతో సమావేశమయ్యారు.

రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా మోసం చేసిందని వ్యాఖ్యానించారు. కాజీపేట్​లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడితే పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాదిమందికి ఉపాధి కలుగుతుందని వినయ్​ భాస్కర్​ తెలిపారు.

ఇదీ చూడండి:కాసేపట్లో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details