రాష్ట్ర ప్రభుత్వం సామాజిక స్పృహతో ప్రవేశపెట్టిన పథకం కల్యాణ లక్ష్మి అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచులకు అన్ని విధాలా అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెరాస అని కొనియాడారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని తన నివాసంలో సంగెం, గీసుగొండ మండలాల్లోని పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
పేదింటి ఆడ పడుచులకు అండ కల్యాణ లక్ష్మి: ఎమ్మెల్యే చల్లా - MLA Challa distributing Kalyana Lakshmi checks
సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలోని సంగెం, గీసుకొండ మండలాల్లోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
![పేదింటి ఆడ పడుచులకు అండ కల్యాణ లక్ష్మి: ఎమ్మెల్యే చల్లా MLA Challa distributing Kalyana Lakshmi checks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8662219-445-8662219-1599121153464.jpg)
ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి, నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎక్కడా అవినీతికి తావివ్వకుండా, పార్టీలకు అతీతంగా పాలన చేసినందుకే.. కేసీఆర్ రెండోసారీ అధికారంలోకి వచ్చారన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై అధికారులు ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సంగెం, గీసుగొండ మండల తహసీల్దార్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన