తెలంగాణ

telangana

ETV Bharat / state

MLA Challa Dharma Reddy Controversy : 'ఊరికి చేసుడే ఎక్కువ' అంటూ.. ఎమ్మెల్యే ధర్మారెడ్డి సంచలన కామెంట్స్

MLA Challa Dharma Reddy Controversy: ఊరికి చేసుడే ఎక్కువ.. ఇంకా మాకేం చేశారు అని అడుగుతున్నారా అంటూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి హనమకొండ జిల్లా వరికోల్ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే ధర్మారెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆగ్రహానికి గురైన ఆయన అక్కడి గ్రామస్థులపై మండిపడ్డారు.

MLA Challa Dharma Reddy
Varikol Villagers Protest for MLA Challa Dharma Reddy

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 12:00 PM IST

Updated : Sep 29, 2023, 12:14 PM IST

MLA Challa Dharma Reddy Controversy :హనుమకొండ జిల్లా నడికుడ మండలం వరికోల్​ గ్రామంలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(MLA Dharma Reddy), ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డికి గ్రామస్థుల నుంచి నిరసన(Villegers Protest) తెగ తగిలింది. ఎమ్మెల్యే ధర్మారెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారు. మీ గ్రామస్థుడైన ఎమ్మెల్సీ శ్రీనివాస్​ రెడ్డి(MLC Srinivas Reddy).. మీ గ్రామానికి ఎక్కువ చేయడమే మీకు ఎక్కువైందంటూ ఆగ్రహానికి లోనయ్యారు. అంతకు ముందు ప్రభుత్వ పథకాలైన రెండు పడక గదుల ఇళ్లు, దళిత బంధు వారికి రావడం లేదని గ్రామస్థులు మొరపెట్టుకున్నారు. గ్రామంలో ఇంతకుముందు ఇచ్చిన వారికే మళ్లీ ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డిలను నిలదీశారు.

MLA Challa Dharma Reddy Controversial Comments :ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో సభావేదిక పక్కనే ఉన్న చెట్టు పైకి ఎక్కి ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. ఈ క్రమంలో అసహనానికి గురైన ధర్మారెడ్డి.. మీరన్న మాటలు అన్ని తాను వింటున్నానని చెప్పారు. 'మీ బాధ ఏంటో అర్థమైందని.. ఈ రోడ్లు, బిల్డింగులు, మహిళా భవనం తమకెందుకని.. మీ సొంతానికి ఏమిచ్చారో అనే ఆలోచన మీ మదిలో ఉంది అంతేకదా! మాకేం డబ్బులు, సంక్షేమ పథకాలు అందాయి.. మాకేం జేసినవ్​ అంటున్నారు అంతే కదా అంటూ. ఇప్పటికే సీనన్న ఊరికి చాలా ఎక్కువ చేసిండు'.. అంటూ ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో గ్రామస్థుల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. చేసేదేమీ లేక పూర్తి వివరాలు కనుక్కొని అందరికీ న్యాయం చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు.

Wyra MLA Fires on Minister Puvvada : ఉమ్మడి ఖమ్మం బీఆర్​ఎస్​లో లొల్లి.. ఏకంగా మంత్రిపైనే వైరా ఎమ్మెల్యే విమర్శలు

Challa Dharma Reddy Fires on Varikol Villagers :అంతకు ముందు వరికోల్​ను అభివృద్ధి పథంలో నడిపించానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. గురువారం రోజున తన సొంత గ్రామమైన వరికోల్​లో రూ.3.90 కోట్లు, పరకాల మండలంలోని వెంకటాపూర్​, నాగారం గ్రామాల్లో రూ.5.44 కోట్లతో బీటీ రోడ్ల పనులకు నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వరికోల్​ సర్పంచి సాధు నిర్మల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పంచాయతీ భవనం నిర్మించి దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ చేశామని తెలిపారు. ఆడబిడ్డలకు ఉపాధి కోసం ఫుడ్​ ప్రాసెసింగ్​ ప్రాజెక్టును తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత రానున్న ఎన్నికల్లో మళ్లీ బీఆర్​ఎస్​ను ఆదరించాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి కోరారు.

ఎమ్మెల్యేకు రైతుల నిరసన సెగ.. వాగ్వాదానికి దిగటంతో అసహనంగా..

ఈటల ఆత్మగౌరవాన్ని భాజపాకు తాకట్టు పెట్టుకున్నారు: ఎమ్మెల్యే చల్లా

Last Updated : Sep 29, 2023, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details