మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్వస్థలం వరంగల్ అర్బన్ జిల్లా కమాలపురం మండలంలో మైనార్టీల మద్దతు తెరాసకే ఉందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల మైనార్టీ సంఘాల నాయకులతో హన్మకొండలోని తన నివాసంలో చల్లా సమావేశమయ్యారు. తెరాస హయాంలోనే ముస్లింలకు ప్రాధాన్యత దక్కిందని ఎమ్మెల్యే అన్నారు. ముస్లిం, మైనారిటీలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచి వారి అభివృద్ధికి దోహదపడుతున్నారని పేర్కొన్నారు.
ఈటల ఆత్మగౌరవాన్ని భాజపాకు తాకట్టు పెట్టుకున్నారు: ఎమ్మెల్యే చల్లా - telangana news
మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆయన ఆత్మగౌరవాన్ని భాజపాకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈటల స్వస్థలం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురంలోని మైనార్టీల మద్దతు తెరాసకే ఉందని ఆయన అన్నారు.
![ఈటల ఆత్మగౌరవాన్ని భాజపాకు తాకట్టు పెట్టుకున్నారు: ఎమ్మెల్యే చల్లా](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
స్థానిక మైనార్టీల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. ఈటల రాజేందర్.. ఆత్మగౌరవాన్ని భాజపాకు తాకట్టు పెట్టుకున్నారని విమర్శించారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఈటల చేసిన వ్యాఖ్యలకు అన్నివర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని... సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారని చల్లా అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ సాదిక్ పాషా, ఉపాధ్యక్షులు, మాదన్నపేట వార్డు సభ్యులు మహమ్మద్ షేక్ ఆ పార్టీకి రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే సమక్షంలో తెరాస తీర్ధం పుచ్చుకున్నారు.
ఇదీ చదవండి:నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం.. ఆకస్మిక దాడులతో వ్యాపారులు హడల్