శ్రీరాముడి పేరుతో భాజపా రాజకీయాలు చేస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. శ్రీరాముడిని అపవిత్రం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హన్మకొండలోని ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా... దేవుడి పేరుతో భాజపా నాయకులు, కార్యకర్తలు జవాబుదారీతనం లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
శ్రీరాముడి పేరుతో భాజపా రాజకీయాలు: చల్లా ధర్మారెడ్డి - తెలంగాణ వార్తలు
భాజపాపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి పేరుతో భాజపా రాజకీయం చేస్తోందని ఆరోపించారు. భాజపా వాళ్లే కాదు తామూ హిందువులమేనని అన్నారు.
శ్రీరాముడి పేరుతో భాజపా రాజకీయాలు: చల్లా ధర్మారెడ్డి
వసూలు చేస్తున్న డబ్బుల లెక్కలు చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. భాజపా నేతలే కాదు తామూ హిందువులమేనని అన్నారు. భాజపా అంటే శ్రీ రాముడు... శ్రీ రాముడు అంటే భాజపా అన్న చందంగా వారు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.