దాతల సహకారంతో సమకూర్చిన కూరగాయలను వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం 35వ డివిజన్లోని రాజీవ్ గృహకల్ప నివాస సముదాయంలో నివాసముంటున్న పేదలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సుమారు 400 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున కూరగాయలు వారికి అందజేశారు.
దాతలు ముందుకురావడం అభినందనియం: ఎమ్మెల్యే రమేష్ - vardhannapet mla ramesh distributed vegetables at 35th word
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులకు గురవుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. కాజీపేట మండలం 35వ డివిజన్లోని రాజీవ్ గృహకల్ప నివాస సముదాయంలో నివాసముంటున్న పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.
దాతలు ముందుకురావడం అభినందనియం: వర్ధన్నపేట ఎమ్మెల్యే
కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. కొవిడ్-19 కట్టడికి చేపట్టిన లాక్డౌన్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏసీపీ రవీంద్ర కుమార్, కార్పొరేటర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:డీజీపీ నేతృత్వంలో నిత్యావసర సరకుల రవాణా
TAGGED:
Vegetable distrubution