వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలంలోని పలు గ్రామాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పర్యటించారు. దేవన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రమేష్ ప్రారంభించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా రైతులు వారికి కేటాయించిన సమయంలోనే ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
రైతు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేస్తాం.. - వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్
వరంగల్ అర్బన్ జిల్లా దేవన్నపేట గ్రామంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు.
హసన్ పర్తిలో ఎమ్మెల్యే అరూరి రమేష్ పర్యటన
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులుసామాజిక దూరాన్ని పాటిస్తూ... మాస్కులను ధరించాలని చెప్పారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని....రైతులు ఎవ్వరూ అధైర్య పడద్దని ఎమ్మెల్యే అరూరి రమేష్ వివరించారు.
ఇవీ చూడండి: లాక్డౌన్ వేళ.. డిజిటల్ లావాదేవీల హవా