కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రజలు ఇంకొన్ని రోజులు సహకరించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం భీమారంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందించిన ఆరూరి - latest news on vardhannapet mla Aruri ramesh
పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. హసన్పర్తి మండలం భీమారంలోని పారిశుద్ధ్య కార్మికులకు ఆయన నిత్యావసర సరుకులు అందజేశారు.
![పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందించిన ఆరూరి mla Aruri ramesh provided essential supplies for sanitation workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6950119-272-6950119-1587903653764.jpg)
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందించిన ఆరూరి
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా కరోనా కట్టడిలో భాగం కావాలని కోరారు.
ఇదీ చదవండి:కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం