తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోంది' - వరంగల్​ అర్బన్​ జిల్లా తాజావార్తలు

రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని... వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ అన్నారు. కష్టకాలంలో రైతుబంధు డబ్బులు అన్నదాతలకు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హసన్​పర్తిలో సీఎం చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు.

palabhishekam to cm KCR photo
కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​

By

Published : Jun 15, 2021, 1:32 PM IST

సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని... వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు.​ కష్టకాలంలో రైతులకు రైతుబంధు డబ్బులు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హాసన్​పర్తిలో ముఖ్యమంత్రి చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు.

రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అన్నదాతల కష్టాలను గుర్తుంచుకొని వారికోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి: Santhosh babu Family : గుండెల్లో బాధ కన్నా.. గర్వమే ఎక్కువ..

ABOUT THE AUTHOR

...view details