తెరాస ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేస్తుందని వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా, కాజీపేట్ మండలం మడికొండ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
'గ్రామాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోంది' - warangal urban news
వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రభుత్వ పాలనను ఆయన కొనియాడారు.
'గ్రామాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోంది'
గ్రామాలను పట్టణాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం రూ. 1 కోటి 20 లక్షల నిధులను మంజూరు చేశారని తెలిపారు. అనంతరం గ్రామంలో మహిళల కోసం నిర్మించిన మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాలుని ప్రారంభించారు.
ఇదీ చదవండి:'భారతరత్న' ప్రచారం ఆపండి- నెటిజన్లకు టాటా విజ్ఞప్తి