కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కొనియాడారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్నారన్నారు.
'పారిశుద్ధ్య కార్మికులది అవిశ్రాంత పోరాటం' - LOCK DOWN UPDATES
గ్రేటర్ వరంగల్ 6వ డివిజన్ తిమ్మాపూర్లో పారిశుద్ధ్య కార్మికులకు నోట్ల దండలతో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ వినూత్న సన్మానం చేశారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని కొనియాడారు.

'పారిశుద్ధ్య కార్మికులది అవిశ్రాంత పోరాటం'
గ్రేటర్ వరంగల్ 6వ డివిజన్ తిమ్మాపూర్లో పారిశుద్ధ్య కార్మికులకు నోట్ల దండలతో వినూత్నంగా సన్మానం చేశారు. అనంతరం బియ్యం, కూరగాయలు, నిత్యవసర సరుకులు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాశ్, కార్పొరేటర్ చింతల యాదగిరి, పీఏసీఎస్ ఛైర్మన్ జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.