వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని... కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరికీ ఉపశమనం కలగాలని కోరుతూ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ చండీ హోమం నిర్వహించారు. కొవిడ్ కారణంగా ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో కుటుంబసభ్యులతో కలసి యాగం నిర్వహించినట్లు తెలిపారు.
కరోనా నుంచి విముక్తి కలగాలని చండీహోమం చేసిన ఎమ్మెల్యే - చండీహోమం నిర్వహించిన ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
కరోనా నుంచి ప్రజానికానికి విముక్తి కలగాలని ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ చండీ హోమం నిర్వహించారు. అన్‌లాక్ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా నుంచి విముక్తి కలగాలని చండీహోమం చేసిన ఎమ్మెల్యే
అన్‌లాక్ నేపథ్యంలో ప్రజలు అజాగ్రత్తగా ఉండరాదని విజ్ఞప్తి చేశారు. ప్రతి నిత్యం అప్రమత్తంగా ఉండాలని, మాస్కు, శానిటైజర్‌ను తప్పక వాడాలని కోరారు.
ఇదీ చదవండి:ధర్మపురి ఆలయ ధర్మకర్తల మండలికి దేవాదాయశాఖ నోటిఫికేషన్