తెలంగాణ

telangana

ETV Bharat / state

రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే ఆరూరి - వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్

వరంగల్ అర్బన్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్..​ కాజీపేట్ మండలం మడికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. నీలకంఠుడిని దర్శించుకునేందుకు భక్తులూ భారీగా తరలివచ్చారు.

mla aroori ramesh visited madikonda mettu rama lingeshwara temple
రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే ఆరూరి

By

Published : Mar 11, 2021, 4:11 PM IST

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. కుటుంబ సమేతంగా.. శివయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని.. ఎమ్మెల్యే ఆలయ అధికారులను కోరారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ సంయమనం పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి:పొట్లపల్లి రాజేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలు

ABOUT THE AUTHOR

...view details