వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పున్నెల్ క్రాస్ రోడ్డు వద్ద లారీ, ఆటో ఢీకొని పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే రమేష్ కాన్వాయ్ ఆపి క్షతగాత్రుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సాయం - warangal district latest news
రోడ్డు ప్రమాద బాధితులను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆదుకున్నారు. లారీ, ఆటో ఢీకొని పలువురికి గాయాలు కాగా వారిని పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు. స్వయంగా అంబులెన్సుకు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సాయం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని స్వయంగా ఎమ్మెల్యే అంబులెన్సుకు సమాచారం ఇచ్చి ఆర్థిక సాయం అందించి ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆదేశించారు.
ఇవీ చదవండి:నేడు, రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేత