వరంగల్ పట్టణ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్లో ముస్లింలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సరకులను పంపిణీ చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా సుమారు 200 మందికి నిత్యావసర సరకులను అందజేశారు.
ముస్లింలకు సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - corona virus
వరంగల్ పట్టణ జిల్లా వంగపహాడ్లో రంజాన్ సందర్భంగా 200 మంది ముస్లింలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
ముస్లిం సోదరులకు సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నిరుపేద ముస్లింలకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అరూరి గట్టుమల్లు ట్రస్ట్ ఆధ్వర్యంలో సరకులను పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే రమేష్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ముస్లింలు భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.