రక్షాబంధన్ సందర్బంగా వృక్షాబంధన్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌లో నిర్వహించారు. మియావాకి అనే విధానం ద్వారా క్యాంపస్ లోపల ఒక చిన్న అడవిని తయారుచేయడానికి అధ్యాపకులు, విద్యార్థులు సామూహికంగా మొక్కలు నాటారు. క్యాంపస్‌లో రెండు ఎకరాల స్థలంలో 2000 వేల మొక్కలు నాటారు. రక్షాబంధన్ రోజు తాము నాటిన మొక్కలను రక్షణగా ఉంటామని తెలిపారు. ముఖ్య అతిధులుగా కళాశాల డైరెక్టర్ ఎన్వీ రమణారావుతో పాటుగా జిల్లా అటవీ సంరక్షణా శాఖ అధికారి ఎంజే అక్బర్ పాల్గొని మొక్కలు నాటారు.
వరంగల్ నిట్‌లో వృక్షాబంధన్ - జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్
వరంగల్ నిట్ విద్యార్థులు వినూత్నంగా వృక్షాబంధన్ జరుపుకున్నారు. నాటిన మొక్కలను రక్షణగా నిలబడి విద్యాసంస్థ ప్రాంగణాన్ని వనమయం చేస్తామని తెలిపారు.
వరంగల్ నిట్‌లో వృక్షాబంధన్