తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మినవారి పేరు లేదు... కొన్నవారి ఊసే లేదు! - వరంగల్ అర్బన్ లేటెస్ట్ న్యూస్

ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమికి అమ్మిన వారి పేరు కానీ కొన్నవారి పేరు లేకుండా ఇతరుల పేరుతో పాసు పుస్తకం వచ్చిందని గజ్జెల సురేశ్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తన సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

mistakes in pass book registration through dharani portal in telangana
ధరణి​ తప్పులు: 'అమ్మినవారి పేరు లేదు... కొన్నవారి పేరు లేదు'

By

Published : Dec 12, 2020, 1:18 PM IST

ధరణి పోర్టల్​ ద్వారా రిజిస్ట్రేషన్​ చేసుకున్న భూమి పాసు పుస్తకంలో సంబంధం లేని వ్యక్తుల పేరు ఉందని గజ్జెల సురేశ్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన సురేశ్​ తాను కొన్న భూమి పాస్ పుస్తకంలో అమ్మిన వారి పేరు, కొన్న తన పేరు కాకుండా ఇతరుల పేర్లు రావడంతో ఆశ్చర్యపోయారు. ఈ భూమిని ధరణి పోర్టల్​ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూమిని నవంబర్​ 28, 2020న గజ్జెల వెంకట స్వామి నుంచి కొనుగోలు చేసి స్లాట్ బుకింగ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.

గజ్జెల వెంకట స్వామి తన సర్వే నం:581/7 లోని 0.29 గుంటల భూమిని తహసీల్దార్ సబ్ రిజిస్టర్ ఆఫీసు భీమదేవరపల్లిలో ఇరువురు వేలి ముద్రలు ఇచ్చారని తెలిపారు. వెంటనే అమ్మినవారి పాస్ బుక్ నం T21010011248 నుంచి భూమి డిలీట్ అయింది. కానీ గజ్జెల సురేశ్​కి పాస్ బుక్ రాకపోగా... భూమితో సంబంధం లేని కొండా సత్యనారాయణ అనే పేరుతో పాసు పుస్తకం రావటంతో రైతు ఆశ్చర్యపోయారు.

ధరణి పోర్టల్ సాంకేతిక లోపంతో ఇలా జరిగిందని తహసీల్దార్ ఉమారాణి తెలిపారు. అమ్మిన వ్యక్తి నుంచి డిలీట్ అయిన భూమి కొన్న వారికి యాడ్ కాలేదని... తప్పుగా వచ్చిన వారి పేరునా కాలేదని స్పష్టం చేశారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి దాదాపు 15 రోజులు దాటినా... పరిష్కరించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పూర్తిగా ఇవ్వాలని అమ్మిన రైతు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని భూమిని కొనుగోలు చేసిన రైతు గజ్జెల సురేశ్ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:ఒకే మండపంలో తల్లీకూతుళ్ల పెళ్లిళ్లు!

ABOUT THE AUTHOR

...view details