వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి రికార్డు ధరలను నమోదు చేస్తోంది. క్వింటాల్ మిర్చి ఏకంగా 19 వేల 5 వందలకు చేరింది.
19 వేలు దాటిన ఎర్రబంగారం
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా మిర్చి ఏకంగా 19,500 రూపాయలకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. మిర్చికి రేటు పెరిగిన నేపథ్యంలో రైతులు ఎక్కువ మొత్తంలో యార్డుకు మిర్చిని తీసుకొస్తున్నారు.
బంగారం హవా కొనసాగిస్తున్న ఎర్రబంగారం
అంతర్జాతీయంగా ఎగుమతులను ప్రోత్సాహిస్తే మిరప ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కువ మెుత్తంలో ఎర్రబంగారం మార్కెట్ యార్డుకు రావడంతో కళకళలాడుతోంది.
ఇవీ చూడండి:'ఐఎఫ్ఎస్' ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజం