Mirchi prices in Enumamula market: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో.. మిర్చి ధరలు బంగారంతో పోటీపడుతున్నాయి. ధరలు రోజురోజుకూ పెరుగుతూ.. ఇప్పుడు రూ. 45 వేలకు చేరువలో ఉంది. దేశీ రకం మిర్చి.. మార్కెట్ చరిత్రలోనే మొదటిసారిగా రూ. 44 వేల గరిష్ఠ ధర పలికింది. సింగిల్ పట్టి రకం రూ. 42,500 ధర పలికినట్లు.. మార్కెట్ అధికారులు తెలిపారు. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో.. ఈ ఏడాది మిర్చి ధరలు ఉన్నాయని వ్యాపార వర్గాలు వెల్లడించాయి.
Mirchi Prices: బంగారం ధరకు చేరువలో మిర్చి.. మార్కెట్ చరిత్రలో రికార్డు - mirchi prices in telangana
Mirchi prices in Enumamula market: వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో దేశీ రకం మిర్చి.. రైతులపై కాసులు కురిపిస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో ఎర్రబంగారం.. రికార్డు ధర పలుకుతోంది. నిన్నమొన్నటి దాకా రూ. 35 వేలు ఉన్న మిర్చి.. ఇప్పుడు రూ. 44 వేలకు చేరి రైతులకు ఊరటనిస్తోంది.
మిర్చి ధరలు
మిర్చి దిగుబడి లేకపోవడం.. అంతర్జాతీయ మార్కెట్‌లో మిర్చి డిమాండ్ ఉండటం కారణంగా మిరప ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని.. వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది మిర్చి దిగుబడి సగానికి పడిపోయిందని.. రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మిరప ధర మాత్రం ఆశాజనకంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:Lemon Farmers losses: సిండికేట్గా దళారులు.. నిమ్మ రైతులకు నష్టాలు