తెలంగాణ

telangana

ETV Bharat / state

'దళారులతో కుమ్మక్కై మిర్చి ధరను తగ్గించేశారు' - ఎనుమాముల  మార్కెట్ లో మిర్చి  రైతులు ఆందోళన

వరంగల్ ఎనుమాముల మార్కెట్​లో మిర్చి  రైతులు ఆందోళన చేపట్టారు. దళారులతో కుమ్మక్కై మిర్చి ధరను తగ్గించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

mirchi farmers dharna at enumamula mirchi market
'దళారులతో కుమ్మక్కై మిర్చి ధరను తగ్గించేశారు'

By

Published : Jan 20, 2020, 2:31 PM IST

వరంగల్ ఎనుమాముల మార్కెట్​లో మిర్చి ధర తగ్గడం వల్ల రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తేజ రకం మిర్చిని మూడు రోజుల క్రితం రూ.21 వేలు పలకగా... నేడు రూ.9 వేలకే కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ధర్నా చేపట్టారు.

దళారులంతా కుమ్మక్కై మిర్చి రేటు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల ఆందోళనతో మార్కెట్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

'దళారులతో కుమ్మక్కై మిర్చి ధరను తగ్గించేశారు'

ఇవీ చూడండి: నేటి నుంచి దావోస్​లో కేటీఆర్​ పర్యటన

ABOUT THE AUTHOR

...view details