వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు దేవాలయంలో జనవరి 5 నుంచి ప్రారంభమయ్యే శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు... మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, తాటికొండ రాజయ్య, మేయర్ గుండా ప్రకాష్, కుడా ఛైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ సుధీర్ బాబు తదితరులు హాజరయ్యారు. దాతల సహకారంతో..... ప్రభుత్వ నిధులతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు ఏర్పాట్లు - MINISTERS REVIEW MEETING ON INAVOLU MALLIKARJUNA SWAMY CELEBRATIONS
శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
MINISTERS REVIEW MEETING ON INAVOLU MALLIKARJUNA SWAMY CELEBRATIONS
TAGGED:
inavolu jaathara erpatlu