త్వరలో జరగనున్న ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తంపై వరంగల్ జిల్లాకు చెందిన వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో హన్మకొండలోని మంత్రి ఎర్రబెల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్లు సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల ఎత్తుగడలపై మంత్రులు నేతలతో సమీక్ష చేశారు. అభ్యర్థి ఎవరైనా, గెలుపు ఖాయంగా పని చేయాలని నిర్ణయించారు. పార్టీ బాధ్యులు, వివిధ విభాగాల బాధ్యులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై మంత్రులిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తంపై మంత్రుల సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తంపై వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాఠోడ్లు సమావేశమయ్యారు. ఓట్ల నమోదును పకడ్బందీ నిర్వహించాలని నేతలకు మంత్రులు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి-సంక్షేమ పథకాలే ప్రతి ఎన్నికలోనూ పార్టీని గెలిపిస్తున్నాయన్నారు.
గులాబీ జెండా, సీఎం కేసీఆర్ అభివృద్ధి-సంక్షేమ ఎజెండా ప్రజల గుండెల నిండా పదిలంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి-సంక్షేమ పథకాలే ప్రతి ఎన్నికలోనూ పార్టీని గెలిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. ఓట్ల నమోదును పకడ్బందీగా నిర్వహించాలని నేతలకు మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలను ఆలోచనా పరులైన పట్టభ్రదులకు తెలిసేలా చేయాలన్నారు. పరస్పర సహకారం, సమన్వయంతో ఎన్నికల్లో వ్యవహరిద్దామని నేతలకు మంత్రి ఎర్రబెల్లి సూచించారు. పార్టీ ఆలోచనలు, ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశానుసారం నడుచుకుంటే ఎన్నికెదైనా నల్లేరు మీద నడికేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
ఇవీ చూడండి: దుబ్బాక పోరు: తెరాస, కాంగ్రెస్, భాజపా నేతల ఆరోపణల పర్వం