తెలంగాణ

telangana

ETV Bharat / state

DEVADULA PROJECT: కాళేశ్వరం, దేవాదులతో ఉమ్మడి వరంగల్ సస్యశ్యామలం: ఎర్రబెల్లి - review on deveadula project

దేవాదుల ప్రాజెక్టు పెండింగ్​ పనులపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​ రావు, సత్యవతి రాఠోడ్​ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరుతుందని.. అందుకు అనుగుణంగా పెండింగ్​ పనులను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

DEVADULA PROJECT
దేవాదుల ప్రాజెక్టు

By

Published : Aug 29, 2021, 1:44 PM IST

Updated : Aug 29, 2021, 3:32 PM IST

దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని జిల్లా కలెక్టరేట్​లో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్​తో కలిసి.. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్​ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి చెరువు.. దేవాదుల జలాలతో నిండేలా ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సూచించారు.

కాళేశ్వరం, దేవాదుల జలాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని ఎర్రబెల్లి అన్నారు. దేవాదుల నీటిని పూర్తిగా వరంగల్ జిల్లాకే వాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు మంత్రి ఈ సమావేశంలో వెల్లడించారు. సమీక్షలో ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Vanidevi: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన సురభి వాణీదేవి

Last Updated : Aug 29, 2021, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details