రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం తో పాటు మొక్కజొన్న, శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్న మంత్రి రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన సరుకు నగదు చెల్లింపులను మూడు రోజుల వ్యవధిలో వారి వారి ఖాతాలలో జమ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులు గుంపులు గుంపులుగా కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి బారులు కట్టొద్దని సూచించారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు బంధు లబ్ధిదారులకు ఎర్రబెల్లి చెక్కులను పంపిణీ చేశారు. రైతు బంధు పథకం ద్వారా రెండు లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తామని తెలిపారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి - MINISTER YERRABELLI OPENS PROCUREMENT CENTER WARANGAL
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మొక్కజొన్న, శనగ కొనుగోలు కేంద్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. కొనుగోలు చేసిన ధాన్యాలకు నగదును రైతుల ఖాతాలలో మూడు రోజుల్లోగా ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు.

Breaking News
ఇదీ చూడండి :చిట్టీ వసూళ్ల పేరుతో వేధింపులు వద్దు