తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్​ కోలుకోవాలని మంత్రి సత్యవతి ప్రత్యేక పూజలు - minister satyavati venerations for cm kcr and ktr health in warangal bhadrakali temple

కరోనా మహమ్మారి నుంచి సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్​ ప్రత్యేక పూజలు జరిపించారు. వరంగల్​ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు.

minister satyavati venerations for cm kcr and ktr
మంత్రి సత్యవతి ప్రత్యేక పూజలు

By

Published : Apr 30, 2021, 1:32 PM IST

కరోనా బారి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరితగతిన కోలుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ ఆరోగ్యంగా ఉండాలని వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు.

మంత్రితో పాటు, ప్రభుత్వ చీఫ్ విప్​ దాస్యం వినయ్ భాస్కర్​కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తుందని మంత్రి సత్యవతి ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ఎగ్జిట్‌ పోల్స్​: నాగార్జునసాగర్​లో తెరాసకు 50.48 శాతం ఓట్లు

ABOUT THE AUTHOR

...view details