రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న మంత్రి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి హైదరాబాద్కు వెళ్లిపోయారు.
Minister Sathyavathi: మంత్రి సత్యవతి రాఠోడ్కు అస్వస్థత - సీఎం కేసీఆర్ పర్యటన
మంత్రి సత్యవతి రాఠోడ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో ఆమె పాల్గొన్నారు.
మంత్రి సత్యవతి
ఉదయం నుంచి ఏమి తినకపోవడంతోనే మంత్రి అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు ఆమె సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Cm Yadadri Visit: సీఎం యాదాద్రి పర్యటన... బాలాలయంలో దర్శనం