వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా పాజిటవ్ వ్యక్తులంతా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడం శుభపరిణామమని గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. జిల్లాలో అందరి సమష్ఠి కృషి ఫలితమే ఈ విజయమని ఆమె కొనియాడారు.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని నందనాగార్డెన్స్‌లో అధికారులతో సమావేశమైన మంత్రి సత్యవతి కొవిడ్ నియంత్రణ చర్యలు, తాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సమీక్షించారు.