తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్ వ్యవస్థలో కొత్త ఒరవడి తీసుకురావాలనుకోవడం సరికాదు: సత్యవతి

Minister Satyavathi Rathod fires on Governor: గవర్నర్‌ తమిళిసై తీరుపై మంత్రి సత్యవతి రాఠోడ్‌ విమర్శలు గుప్పించారు. చట్టసభల తీర్మానాన్నే గవర్నర్ గౌరవించకుంటే.. దేనిని గౌరవిస్తారని ప్రశ్నించారు. తమ చుట్టూ తిరిగితే తప్ప బిల్లులు ఆమోదించరా? అని అన్నారు.

Satyavathi Rathod
Satyavathi Rathod

By

Published : Mar 4, 2023, 5:16 PM IST

Minister Satyavathi Rathod fires on Governor: చట్టసభలు ఆమోదించిన బిల్లులను పెండింగ్‌లో పెట్టి.. గవర్నర్ వ్యవస్థలో తమిళిసై సౌందరరాజన్​ కొత్త ఒరవడి తీసుకురావాలనుకోవడం సరికాదని మంత్రి సత్యవతి రాఠోడ్ హితవు పలికారు. చట్టసభలు ఆమోదించిన బిల్లులను పెండింగ్​లో పెట్టడమంటే.. అవి పని చేయనట్టు భావించడమేనా అని ప్రశ్నించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. గవర్నర్​ను కలిసినా బిల్లులు ఆమోదం జరగలేదని చెప్పారు. వరంగల్​లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

"సుప్రీంకోర్టుకు పోకుండా తన చుట్టే తిరగాలన్నట్లుగా గవర్నర్‌ తీరు ఉంది. చట్ట సభల తీర్మానాలనే గౌరవించకుంటే దేనిని గౌరవిస్తారు. మీ చుట్టూ తిరిగితే తప్ప బిల్లులు ఆమోదించరా?. ఇదేం సంస్కృతి, ఇదేం పద్దతి. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులకు గౌరవం లేదా? గవర్నర్‌ వ్యవస్థకు కొత్త ఒరవడి తీసుకురావటం సరైంది కాదు. మా మంత్రులు పెండింగ్ బిల్లులపై గవర్నర్ వద్దకు వెళ్లి మాట్లాడారు. అయినా బిల్లులు ఎందుకు ఆమోదించరు." - సత్యవతి రాఠోడ్, మంత్రి

తన చుట్టే తిరగాలన్నట్లుగా గవర్నర్‌ తీరు ఉంది: సత్యవతి రాఠోడ్‌

ప్రీతి ఆత్మహత్యకు కారకులైన దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: వరంగల్​లో ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సత్యవతి రాఠోడ్ తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందిస్తామని వివరించారు. మరోవైపు ప్రీతి ఆత్మహత్యకు కారకులైన దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రీతిది హత్య, ఆత్మహత్య అన్నదానిపైన సమగ్రంగా విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటికే సైఫ్​ను అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కేసుపై విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని తెలిపారు. ప్రీతి కుటుంబసభ్యులు కోరుకునే వారిని విచారణాధికారిగా వేయడానికి సిద్ధమని సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు.

అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయి:మరోవైపు రాష్ట్రప్రభుత్వం, గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ల మధ్య వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో గవర్నర్​ ప్రసంగంతో పరిస్థితులు చక్కబడ్డాయనుకునేలోపే.. పెండింగ్​ బిల్లుల విషయమై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఇదే విషయంపై గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ ట్విటర్ వేదికగా స్పందించారు.

రాజ్​భవన్​.. దిల్లీ కంటే దగ్గరగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశించి ట్వీట్​ చేశారు. ఈ క్రమంలోనే సీఎస్​గా శాంతి కుమారి బాధ్యతలు తీసుకున్నాక రాజ్​భవన్​కు రావడానికి సమయం లేదా అని ప్రశ్నించారు​. ప్రొటోకాల్​ లేదు, అధికారికంగా రాలేదని తెలిపారు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా సీఎస్​ కలవలేదని చెప్పారు.. స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయని తమిళిసై సౌందర రాజన్​ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:పెండింగ్​ బిల్లుల వివాదం.. స్పందించిన గవర్నర్​.. ఏమన్నారంటే..?

గవర్నర్ అచ్చం రాజకీయ నాయకురాలుగా మారారు: రేవంత్​రెడ్డి

'బీజేపీ, బీఆర్ఎస్​లను ప్రజలు నమ్మేస్థితిలో లేరు.. నెక్ట్స్​ మేమే అధికారంలోకి'

దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. సిసోదియాకు మరో 2 రోజులు కస్టడీ పొడిగింపు..

ABOUT THE AUTHOR

...view details