భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ మండిపడ్డారు. బండి సంజయ్ తెరాస పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ప్రజలు భాజపాకు తగిన గుణపాఠం చెబుతారని ఆమె అన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంత్రి సత్యవతి రాఠోడ్ వరంగల్ తూర్పులోని పలు కాలనీల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు.
గ్రేటర్ వరంగల్‌లో 66సీట్లు గెలవబోతున్నాం: సత్యవతి రాఠోడ్ - telangana varthalu
గ్రేటర్ వరంగల్‌లో ప్రచారం జోరందుకుంది. వరంగల్ తూర్పులోని పలు కాలనీల్లో మంత్రి ఈశ్వర్‌తో కలిసి మంత్రి సత్యవతి రాఠోడ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. బండి సంజయ్ చేసే వ్యాఖ్యలను వరంగల్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
గ్రేటర్ వరంగల్‌లో 66సీట్లు గెలవబోతున్నాం: సత్యవతి రాఠోడ్
బండి సంజయ్ చేసే వ్యాఖ్యలను వరంగల్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగో స్థానానికి పడిపోయినా బుద్ధి రావడం లేదన్నారు. ఈ గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో 66 సీట్లకు గాను 66 సీట్లు గెలవబోతున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వరకు వేసవి సెలవులు