పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై భాజపా శ్రేణుల దాడిని మంత్రి సత్యవతి రాఠోడ్ ఖండించారు. ఈ తరహా చిల్లర రాజకీయాలకు భాజపా నాయకలు స్వస్తిపలకాలని హితవు పలికారు.
చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన మంత్రి సత్యవతి
చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని మంత్రి సత్యవతి రాఠోడ్ ఖండించారు. దాడిపై భాజపా నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రామమందిర నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసమే భాజపా నాయకులు కుట్ర పన్నారని ఆరోపించారు.
చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన మంత్రి సత్యవతి
భక్తి ముసుగులో భాజపా నేతలు... రాక్షస పనులు చేయొద్దని సూచించారు. జైలుకెళ్లి సానుభూతి సంపాదించేందుకే కమలం నేతలు... ఈ విధంగా దాడులకు తెగబడుతున్నారని అన్నారు.
హన్మకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటికి వెళ్లిన సత్యవతి రాఠోడ్.. ఆయనను పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రామమందిర నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసమే భాజపా నాయకులు కుట్రపన్నారని ఆరోపించారు.
- ఇదీ చదవండి: 'ఎవరి మనసులైనా నొచ్చుకుని ఉంటే మన్నించండి'