వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి చురుగ్గా సాగుతోంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, వరంగల్ శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్తో కలిసి 15వ డివిజన్లో పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి చర్చించారు.
వరంగల్ పట్టణ ప్రగతిలో మంత్రి సత్యవతి రాఠోడ్ - పట్టణ ప్రగతిలో పాల్గొన్న గిరిజిన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్
గిరిజిన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో కలిసి వరంగ్ పట్టణంలో పర్యటించారు. స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
![వరంగల్ పట్టణ ప్రగతిలో మంత్రి సత్యవతి రాఠోడ్ MINISTER SATHYAVATHI RATODE IN PATTANA PRAGATHI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6278555-445-6278555-1583228507429.jpg)
వరంగల్ పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాఠోడ్
వరంగల్ పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాఠోడ్
మురుగు కాలువల నిర్వహణ సరిగ్గా లేదని మంత్రి ఎదుట కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పర్యటన అనంతరం కార్పొరేటర్ భర్త సురేష్ జోషిని కాలనీవాసులు నిలదీశారు. కార్పొరేటర్ అనుచరులకు కాలనీవాసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సర్దిచెప్పి గొడవను సద్దుమణిగేలా చేశారు.
ఇవీ చూడండి:పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!