పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని... వారి సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో తెరాస అభ్యర్థుల తరఫున మంత్రి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి 16, 17 వ డివిజన్లోని గరీబ్ నగర్, జాన్ పాక, ఆదర్శనగర్లో విస్తృతంగా పర్యటించారు.
పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్: మంత్రి సత్యవతి - తెలంగాణ వార్తలు
గ్రేటర్ వరంగల్ పరిధిలోని డివిజన్లలో ప్రచార పర్వం మొదలైంది. తెరాస అభ్యర్థుల తరఫున మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రచారం చేశారు. నగరంలోని పలుకాలనీల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థించారు. పేదల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
వరంగల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి సత్యవతి, మంత్రి సత్యవతి రాఠోడ్
ఎన్నికలు రాగానే మాట్లాడే విపక్షాలు... ఆ తర్వాత ప్రజలను పట్టించుకోవని విమర్శించారు. తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:పుర ఎన్నికల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ