తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్షేమం, అభివృద్ధి తెరాసతోనే సాధ్యం: మంత్రి సత్యవతి - తెలంగాణ వార్తలు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు జోరందుకున్నాయి. పరకాల నియోజరవర్గంలోని 15వ డివిజన్​లో మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటించారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని వివరించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు.

warangal municipal elections, minister sathyavathi election campaign
వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి సత్యవతి, పరకాలలో మంత్రి సత్యవతి ప్రచారం

By

Published : Apr 23, 2021, 2:28 PM IST

సంక్షేమం, అభివృద్ధి తెరాసతోనే సాధ్యమన్నది ప్రజలు గుర్తించి... ప్రతి ఎన్నికల్లోనూ నిరూపిస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో? విపక్ష నాయకులను నిలదీయాలని కోరారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పరకాల నియోజకవర్గం పరిధిలోని 15వ డివిజన్​లో మంత్రి విస్తృతంగా పర్యటించి... ఓట్లను అభ్యర్థించారు.

డప్పు కొడుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి పోస్తున్నాయని... ఇది సీఎం కేసీఆర్ ఘనతేనని అన్నారు. తెరాస అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: దివ్య రాజునాయక్

ABOUT THE AUTHOR

...view details