జూన్ 17వ తేదీన వరంగల్ నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన శంకుస్థాపన చేయనున్న ఆక్సిజన్ పార్కును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఆక్సిజన్ పార్కుతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులను మంత్రి శంకుస్థాపన చేయనున్నందున పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్‌లో కూడా ఆధ్వర్యంలో 4 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఆక్సిజన్ పార్కును ఈ నెల 17వ తేదీన మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ తెలిపారు. ఈ నేపథ్యంలో కూడా, మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులతో కలిసి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
జూన్ 17న కేటీఆర్ వరంగల్ పర్యటన
వర్షాలు కురుస్తునందున చుట్టూ ప్రక్కల మట్టిపోసి గుంతలను నింపి చదను చేయాలని సూచించారు. పార్క్ స్థలం నుంచి మడికొండ వరకు గల రోడ్డుకు ఇరువైపుల ఉన్న ముళ్ల పొదలను, పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులకు తెలిపారు.