తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister KTR Warangal Tour : 'పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు' - తెలంగాణ అభివృద్ధిపై కేటీఆర్

Minister KTR Warangal Tour Today : రాష్ట్ర ప్రజలపై అచంచల విశ్వాసం ఉందని.. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి పంథాలో దూసుకుపోతోందని వెల్లడించారు.

joint Warangal district
ktr

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 1:11 PM IST

Minister KTR Joint Warangal Tour పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు

Minister KTR Warangal Tour Today : ఎన్నికలు సమీపిస్తున్న వేళ.... మంత్రి కేటీఆర్ (KTR) అభివృద్ధి కార్యక్రమాల జోరు పెంచుతున్నారు. ఇటీవలే వరంగల్‌లో రూ.900 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి.. మరోమారు ఈరోజు ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత జయశంకర్‌ భూపాలపల్లిలో 15 ఎకరాల విస్తీర్ణంలో.. 59. 45 కోట్లతో నిర్మించిన.. సమీకృత జిల్లా కలెక్టరేట్‌తో (Integrated District Collectorate) పాటు రూ.25.90 కోట్లతో 37 ఎకరాల్లో నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు.

KTR Fires on Modi in Twitter : "బరాబర్​ మాది కుటుంబపార్టీయే.. రాష్ట్రమే మా కుటుంబం"

KTR Speech Warangal 2023 :భూపాలపల్లి పట్టణంలో నిర్మించిన 416 డబుల్‌ బెడ్‌ రూమ్ ఇండ్లను (Double Bedroom Houses)కేటీఆర్‌.. లబ్ధిదారులకు అందజేశారు. జీవితమంతా తెలంగాణ కోసం పరితపించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ పేరు మీద.. కలెక్టరేట్‌ను ప్రారంభించటం తన పూర్వజన్మ సుకృతమని మంత్రి వెల్లడించారు. పరిశ్రమల్లో ముందుకు వెళ్తున్నామని.. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో కూడా భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని కేటీఆర్ తెలిపారు.

KTR on Hyderabad Development : 'హైదరాబాద్‌పై చిన్న మచ్చ పడినా.. అందరికీ ఇబ్బంది కలుగుతుంది'

KTR on Telangana Development : తెలంగాణలో ఓ వైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమమని కేటీఆర్ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో దేశంలోనే 30 శాతం జాతీయ పంచాయతీ అవార్డులు రాష్ట్రానికి వస్తున్నాయని గుర్తు చేశారు. దేశానికి ఆర్థికంగా చేయూతనిచ్చే రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉన్నామని తెలిపారు.. తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ.. దేశానికే రోల్‌మోడల్‌గా, దిక్సూచిగా ఉందని కేటీఆర్ అన్నారు.

"పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు. జయశంకర్‌ సార్‌ కలెక్టరేట్‌ ప్రారంభించటం నా పూర్వజన్మ సుకృతం. తెలంగాణలో ఓ వైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమం. పల్లె ప్రగతిలో దేశంలోనే 30 శాతం జాతీయ పంచాయతీ అవార్డులు రాష్ట్రానికి వస్తున్నాయి." - కేటీఆర్, మంత్రి

అనంతరం.. హనుమకొండ జిల్లా పరకాలలో రూ.4.85 కోట్లతో నిర్మించిన మున్సిపాలిటీ భవనానికి, రూ.2.15 కోట్లతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని, రూ.2.80 కోట్లతో నిర్మించిన ఆర్డీవో కార్యాలయ భవనాలను.. కేటీఆర్ప్రారంభించనున్నారు. మరో రూ.114 కోట్ల అభివృద్ధి పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చేరుకోనున్న కేటీఆర్‌ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

KTR Comments on Congress and BJP : కాంగ్రెస్​ తరఫున గెలిచిన వాళ్లు.. బీజేపీలోకి జంప్‌ అవుతారు: మంత్రి కేటీఆర్

తొర్రూరులో రూ.25 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. తొర్రూరు పర్యటన ముగించుకుని.. జనగామ జిల్లా కొడకండ్లకు చేరుకుంటారు. అక్కడ మినీ టెక్స్ టైల్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాలతో పాటు బహిరంగ సభల్లోనూ ఆయన పాల్గొంటారు.

KTR Speech at Kamareddy Public Meeting : ఆ కారణంతోనే కేసీఆర్‌.. కామారెడ్డి నుంచి పోటీకి దిగుతున్నారు : కేటీఆర్

Minister KTR Speech in Warangal Tour : పింఛన్ల పెంపు, ఆడబిడ్డలకు సాయంపై త్వరలోనే శుభవార్త: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details