వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని మంత్రి కేటీఆర్ సందర్శించారు. కొవిడ్ వార్డులో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డులోని రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.
ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కేటీఆర్
ఎంజీఎం ఆసుపత్రిలో అదనంగా మరో 150 పడకలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అక్సీజన్, వెంటిలేటర్ సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. త్వరలోనే కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా మార్చి ప్రారంభిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా