కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో తెలంగాణపై ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లయినా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్రలో కొత్త రైల్ కోచ్ ఫ్యాక్టరీని మూడేళ్లలోపే ప్రారంభిస్తామని చెబుతున్నారని అన్నారు.
KTR TWEET: ఏడేళ్లయినా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరా? : కేటీఆర్ - రైల్వే కోట్ ఫ్యాక్టరీపై ట్వీట్
రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లవుతున్నా కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని కేంద్ర రైల్వే మంత్రిని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో కేవలం మూడేళ్లలోనే ప్రారంభిస్తామని చెబుతున్నారని ట్విట్టర్ వేదికగా గుర్తు చేశారు.
మంత్రి కేటీఆర్
తెలంగాణలోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కోచ్ ఫ్యాక్టరీకీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 150 ఎకరాలను కేటాయించిందని వెల్లడించారు. విభజన చట్టంలోని హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఇదీ చూడండి:KTR on Ponds: చెరువుల పరిరక్షణకు ప్రత్యేక కమిషనర్: కేటీఆర్