వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో స్మార్ట్ లైబ్రరీ అతి సుందరంగా రూపుదిద్దుకుంది. ఈ వరంగల్ స్మార్ట్ లైబ్రరీ చాలా బాగుందంటూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. వరంగల్ నగరపాలక సంస్థను ట్విటర్ ద్వారా అభినందించారు. నగరంలోని రంగంపేట ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో అధునికీకరించిన ముఖ ద్వార చిత్రం నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పాఠకుల కోసం ఏర్పాటు చేసిన ఆధునిక కుర్చీలు, పెయింటింగ్ చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి.
KTR: వరంగల్ స్మార్ట్ లైబ్రరీ బాగుందంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ - వరంగల్ నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి
వరంగల్ నగరంలో నిర్మించిన స్మార్ట్ లైబ్రరీ అతి సుందరంగా ఉందంటూ... మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వరంగల్ నగర పాలక సంస్థను అభినందించారు.
గోడలను పుస్తకాల అరల్లా, భవనం ముందు భాగంలో ఓ బాలిక పుస్తకాన్ని శ్రద్దగా చదువుతున్నట్లుగా విభిన్న రంగులతో తీర్చిదిద్దారు. ఒడిశా డాటర్ ఆఫ్ స్టేట్ స్ఫూర్తితో ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం ముఖ చిత్రం ఏర్పాటు చేశారు. రూ.2.90 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు. ఈ గ్రంథాలయంలో ఒకేసారి 500 మంది పుస్తకాలు చదవుకోవచ్చు. అతిత్వరలోనే ఈ స్మార్ట్ గ్రంథాలయం నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది.
ఇదీ చూడండి:MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి