గ్రేటర్ వరంగల్ ఎన్నికల ముంగిట వరంగల్‌లో సుడిగాలి పర్యటన చేస్తున్న ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్... పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాంపూర్‌లో ఇంటింటికి తాగునీటి సరఫరాను కేటీఆర్ ప్రారంభించారు. 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. రూ.1,589 కోట్లతో నగర ప్రజలకు రోజూ తాగునీటి సరఫరా కానుంది. సుమారు 1.77 లక్షల నల్లాలకు స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించనున్నారు.
వరంగల్‌లో సమీకృత మార్కెట్లను ప్రారంభించిన కేటీఆర్
వరంగల్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. నగరంలోని భగీరథ వాటర్ ట్యాంకు, సమీకృత మార్కెట్లను ప్రారంభించారు.
వరంగల్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్
దేశాయిపేటలో జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దూపకుంటలో 600 ఇళ్లు, వరంగల్ ఎల్బీనగర్‌లో షాదీఖానా నిర్మాణం, మండిబజార్‌లో హజ్ హౌస్, లక్ష్మీపురంలో సమీకృత మార్కెట్, పండ్ల మార్కెట్లకు శంకుస్థాపన చేశారు. గరీబ్‌నగర్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: ఓరుగల్లులో కేటీఆర్... మిషన్ భగీరథ ప్రారంభం..