వరంగల్ ప్రజల దాహార్తిని తీర్చే...ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకాన్ని ఉగాది కానుకగా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ముంగిట వరంగల్‌లో సుడిగాలి పర్యటన చేస్తున్న ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్...హైదరాబాద్ నుంచి నేరుగా... కాజీపేట రాంపూర్‌కి చేరుకున్నారు. వరంగల్ నగర వాసులకు ప్రతి రోజూ స్వచ్ఛమైన నీరందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఓరుగల్లులో కేటీఆర్... మిషన్ భగీరథ ప్రారంభం..
గ్రేటర్ వరంగల్‌లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ నగరంలో మంత్రి పర్యటన కొనసాగనుంది. రూ.2 వేల కోట్లకుపైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మంత్రి ప్రారంభిస్తున్నారు.
ఓరుగల్లులో కేటీఆర్ పర్యటన... అభివృద్ధికి శ్రీకారం
ఇందుకోసం మిషన్ భగీరథ కింద 939 కోట్ల రూపాయల వ్యయం కాగా...అమృత్ పథకం కింద 413 కోట్లు ఖర్చు చేశారు. ఇవాళ్టి పర్యటనలో రెండువేల కోట్ల రూపాయలకుపైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి.. ఖిలా వరంగల్ మైదానంలోనూ, శాయంపేట జంక్షన్‌లోనూ జరిగే సభల్లో ప్రసంగిస్తారు. పార్టీ నేతలు, కార్యకర్తలతోనూ సమావేశమై.. త్వరలో రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.
- ఇదీ చూడండి:కేటీఆర్ సార్ మీరు సినిమాల్లో ట్రై చేయలేదా?
Last Updated : Apr 12, 2021, 11:11 AM IST